జామ్ నగర్ లో అనంత్ అంబానీ( Anant Ambani ) ప్రీ వెడ్డింగ్( Pre Wedding ) అంగరంగ వైభవంగా జరిగాయి.దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం ఇక్కడే స్పందన ఇచ్చేసరికి కేవలం బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తలు కోలీవుడ్ స్టార్స్ అలాగే టాలీవుడ్ సెలబ్రిటీలో కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ పెళ్లి వేడుకలలో టాలీవుడ్ నుంచి రామ్ చరణ్( Ram Charan ) ఉపాసన (Upasana ) దంపతులకు మాత్రమే ఆహ్వానం అందింది.ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) టాలీవుడ్ హీరో అయినటువంటి రామ్ చరణ్ ను చాలా ఘోరంగా అవమానించారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) ద్వారా గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈయనకు జరిగినటువంటి అవమానం తెలిసి మెగా ఫాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు.ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు అయినటువంటి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి వేదికపై నాటు నాటు పాటకు( Naatu Naatu Song ) స్టెప్పులు వేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే రామ్ చరణ్ ని కూడా స్టేజ్ పైకి పిలిపించి ఈ ముగ్గురు హీరోలతో కలిసి రాంచరణ్ కూడా స్టెప్పులు వేశారు.

ఇక రామ్ చరణ్ ను స్టేజీపైకి పిలిచే క్రమంలోనే చరణ్‌ని ఇడ్లీ-వడ అని సంభోదించి షారుక్ పిలిచారని, దీంతో కోపమొచ్చి స్టేజీ దిగిపోయానని ఉపాసన మేకప్ ఆర్టిస్టు జెబా హాసన్( Zeba Hassan ) చెప్పింది.ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో పెట్టింది.దీంతో అందరూ షాకవుతున్నారు.
ఇలా బాలీవుడ్ హీరోలను వడాపావ్ అని పిలిస్తే ఊరుకుంటారా అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా ఫన్నీగా అయినా సరే షారుక్ చరణ్‌ని ఇలా పిలవడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
టాలీవుడ్ హీరోల రేంజ్ పెరిగిపోవడాన్ని బాలీవుడ్ హీరోలు తట్టుకోలేకపోతున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







