సినీ దర్శకుడు డైరెక్టర్ క్రిష్ ( Director Krish )తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ ( Radisson Drugs Party )కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం క్రిష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ఈ కేసులో క్రిష్ పోలీసుల ముందు విచారణకు కూడా హాజరయ్యారు.తాజాగా క్రిష్ దాఖలు చేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే పోలీసుల విచారణలో భాగంగా క్రిష్ నుంచి యూరిన్ మరియు బ్లడ్ శాంపిల్స్ సేకరించిన సంగతి తెలిసిందే.యూరిన్ రిపోర్టు నెగిటివ్ రాగా.
బ్లడ్ శాంపిల్స్ కోసం సమయం పడుతుందని తెలిపారు.మరోవైపు డ్రగ్స్ పార్టీ కేసుతో తనకు ఏం సంబంధం లేదని, రాడిసన్ హోటల్ కు స్నేహితుడు కోసం వెళ్లానని క్రిష్ పోలీసులకు తెలిపిన సంగతి తెలిసిందే.







