Narendra Modi : నేడు తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) తెలంగాణ పర్యటనకు వస్తున్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు.

 Prime Minister Modi To Visit Telangana Today-TeluguStop.com

ముందుగా ఆదిలాబాద్ జిల్లా( Adilabad )కు చేరుకోనున్న ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.రూ.6,697 కోట్ల విలువైన పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.

రామగుండంలో సుమారు రూ.6 వేల కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం ఇవ్వనున్నారు.రూ.70 కోట్లతో నిర్మించిన అంబారి – ఆదిలాబాద్ – పింపాలకుట్టి రైల్వే లైన్ ను కూడా జాతికి అంకితం ఇవ్వనున్నారు.అదేవిధంగా రూ.491 కోట్లతో ఆదిలాబాద్ – బేలా మధ్య ఎన్.హెచ్ 353బీప ఉన్న 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేయనున్నారు.తరువాత రూ.136 కోట్లతో ఎన్.హెచ్ 163పై హైదరాబాద్ – భూపాలపట్నం రహదారికి శంకుస్థాపన చేయనున్నారు.అలాగే రేపు సంగారెడ్డి జిల్లా( Sangareddy )లో పర్యటించనున్న ప్రధాని మోదీ రూ.9 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube