ఇంటికి TOLET బోర్డు పెట్టినట్టుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తెరకెక్కిస్తున్న సినిమాలకు టైటిల్స్ కావలెను అనే బోర్డు పెట్టినట్టుగా ఉంది ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి.టాలీవుడ్ లో ప్రస్తుతం అనేక సినిమాలు తెరకెక్కుతున్నాయి.
కానీ ఒక్క చిత్రానికి కూడా టైటిల్ ఖరారు కాకపోవడంతో సదరు హీరోల ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.ఎవరికి వారు ఇష్టమొచ్చిన టైటిల్స్ తో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అనేక ఫేక్ టైటిల్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.ఇంతకీ టైటిల్స్ సస్పెన్స్ లో పెట్టిన హీరోలు ఎవరు ? ఎలాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మహేష్ బాబు, రాజమౌళి( Mahesh Babu, Rajamouli ) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీపై చాలా క్రేజ్ ఉంది.టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ గా ఈ సినిమా ఉండబోతుంది అంటూ మహేష్ బాబు ( Mahesh babu )ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు.చాలా రోజులుగా ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టనే లేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఫ్యాన్స్ మహారాజ్ అనే పేరును కన్ఫర్మ్ చేసి ప్రచారం చేస్తున్నారు.
మామూలుగానే రాజమౌళి జనాలలో ఇలా సస్పెన్స్ పెంచుతూ హీట్ పెంచడంలో దిట్ట.ఈసారి కూడా అదే జరుగుతుంది.ఇక బాలకృష్ణ( Balakrishna ) నటిస్తున్న తన 109వ సినిమాకి కూడా ఇప్పటికీ పేరు ఖరారు కాలేదు.దర్శకుడు బాబి బాలకృష్ణ ( Babi, Balakrishna ) చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా పాలిటిక్స్ కారణంగా బాలకృష్ణ కొన్నాళ్లు పాటు బ్రేక్ తీసుకున్నారు.
మామూలుగానే టైటిల్స్ విషయంలో బాబి చాలా జాగ్రత్తగా ఉంటాడు.మరి వీరి సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారో ఫాన్స్ ఎలాగో డిసైడ్ అయిపోతున్నారు.
విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నటిస్తున్న తన 12వ సినిమాకి కూడా టైటిల్ ఏంటో ఖరారు కాకపోవడంతో ఫ్యాన్స్ ఎవరికి నచ్చినట్టు వారు పెట్టేసుకుంటున్నారు.ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం తన 12 వ సినిమా ఉండబోతుంది.విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తన ప్రతి సినిమా టైటిల్ చాలా ఆలస్యంగానే విడుదల చేస్తాడు.మరి ఇప్పుడు ఎలాంటి టైటిల్ తో వస్తాడో వేచి చూడాలి.
ఇక సుజిత్, నాని( Sujeeth, Nani ) కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కూడా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.అలాగే రామ్ చరణ్ ( Ram Charan )నటిస్తున్న తన 16వ సినిమాకి కూడా టైటిల్ ఖరారు కాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
పెద్ది అనే పేరును రాం చరణ్ ఫాన్స్ వైరల్ చేస్తున్నారు.