పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మొత్తం అధికారికంగా ఏడు సినిమాలు చేస్తున్నారనే విషయం మీకు తెలుసా ? ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు.ఎందుకంటే ఆయన ఇప్పటికే కమిట్ అయిన కొన్ని సినిమాలనే పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి సమయంలో ఆయన చేయబోయే ఆ ఏడు సినిమాలు ఏంటి అనే కంగారు మీకు రావచ్చు కానీ ఇది నిజం.ఆయన ఏడు సినిమాలను అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు.
కొన్ని కొంత మేర షూటింగ్ కూడా పూర్తయ్యాయి.కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
మరికొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి.ఇలా రకరకాల దశల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న నటించబోయే సినిమాలు ఉన్నాయి.
ఇంతకీ ఆ ఏడు సినిమాలు ఏంటి? ఎవరితో చేస్తున్నారు ? అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే సుజిత్ దర్శకుడిగా OG అనే సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఇది 70 శాతం సినిమా పూర్తి చేసుకుంది.కేవలం రెండు వారాల సమయం పవన్ కళ్యాణ్ ఇవ్వగలిగితే అది ముందుగా అనుకున్నట్టు సెప్టెంబర్ 27న విడుదలవడం ఖాయం.
ఇక క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు ( Harihara Veeramallu )అనే మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్.ఇది ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
OG మరియు హరిహర వీరమల్లు సినిమాలో రెండు భాగాలుగా విడుదల కాబోతున్నాయి అనేది పవన్ కళ్యాణ్ అభిమానులను సంతోషానికి గురి చేస్తున్నాయి.దీన్నిబట్టి ఈ రెండు చిత్రాలు రెండు భాగాలతో కలిపి నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నట్టే.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్( Ustad ) సినిమా కేవలం 20 శాతం మీద షూటింగ్ జరుపుకుంది.
ఈ చిత్రంతో కలిపి ఐదు సినిమాలు ఉండగా, దర్శకుడు సురేందర్ రెడ్డి ( Surender Reddy )చెప్పిన కథ కూడా పవన్ ఓకే చేసినట్టుగా సమాచారం అందుతుంది.అది మాత్రమే కాకుండా త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో చిత్రంలో నటించాల్సి ఉంది.ఇలా ఈ ఏడు సినిమాలు కూడా ఇప్పుడే ఇప్పటికే లైనప్ చేసుకొని కొన్ని షూటింగ్ కి సిద్ధంగా అవుతుంటే మరికొన్ని చర్చలో దశల్లో ఉన్నాయి.
గత నాలుగు నెలలుగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోగానే హరిహర వీరమల్లు, ఓజి సినిమాలను కేవలం మూడు నాలుగు వారాల్లో పూర్తి చేసే అవకాశం ఉంది.