విజువల్ వండర్స్ క్రియేట్ చేయాలంటే వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం లేదు.అద్భుతంగా తీయగలిగే క్రియేటివిటీ ఉంటే చాలు అని ఇటీవల కాలంలో కొన్ని చిత్రాలు చూస్తే తెలుస్తుంది.
ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఎలాంటి అద్భుతాలు సృష్టించలేని సినిమాలు కూడా మనకు ఈ మధ్యలో తారసపడ్డాయి.దర్శకుడికి మంచి విజన్ ఉంటే చాలు విజువల్ వండర్స్( Visual Wonders ) అనేవి వాటంతటావే సృష్టించబడతాయి.
అది నిరూపిస్తున్నారు ఇటీవల కొంతమంది దర్శకులు.మరి అలా తక్కువ బడ్జెట్ తో ఎక్కువ విజన్ తో మంచి విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తున్న ఆ దర్శకులు ఎవరు ? ఆ చిత్రాలు ఏంటి ? అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గామి(
( Gaami )

విశ్వక్ సేన్ హీరోగా గామి అనే చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల అయింది.ఈ ట్రైలర్ విడుదలైన రోజు నుంచి అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు.అతి తక్కువ బడ్జెట్ లో తన పరిధిలో అద్భుతమైన విజువల్స్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమయిపోతుంది.విద్యాధర్ దర్శకత్వంలో( Director Vidyadhar )వస్తున్న ఈ సినిమా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కడం లేదు.
హనుమాన్ ( Hanuman )

కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో 300 కోట్లకు కోట్ల రూపాయల విజువల్స్ క్రియేట్ చేయగలిగారు దర్శకుడు ప్రశాంత్ వర్మ( Prasanth Varma ).ఏ రకంగా చూసినా హనుమాన్ చిత్రం చాలా మంది చిన్న బడ్జెట్ చిత్రం అంటే ఒప్పుకోరు.అది కేవలం దర్శకుడు విజన్ వల్లే సాధ్యమైంది.
ఆపరేషన్ వాలెంటైన్ ( Operation Valentine )

వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం కూడా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి మంచి సినిమాగా ప్రూవ్ చేసుకుంటుంది.ఇటీవలే థియేటర్స్ లో విడుదల అయినా ఈ సినిమాను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఖచ్చితంగా ఒక విజువల్ వండర్ అని ఒప్పుకోక తప్పదు.
కేవలం ఈ చిత్రాలు మాత్రమే కాదు కొన్ని రోజుల క్రితం చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 కూడా అద్భుతంగా వచ్చింది.చాలా తక్కువ బడ్జెట్ లో పాన్ ఇండియా హిట్టుగా పేరు సంపాదించుకుంది అలాగే విరూపాక్ష, మా ఊరి పొలిమేర చిత్రాలు కూడా తక్కువ బడ్జెట్ లో తెరకేకి అద్భుతాలు సృష్టించాయి.
హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం కూడా ఇంచుమించు ఇలాంటి అద్భుతమే చేసింది.బడ్జెట్ ఎంత ఇచ్చాము కాదు ఎంత విజన్ మనకు ఉంది అనేది దర్శకుడు నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా చిన్న బడ్జెట్ తో పెద్ద హిట్ లు కొట్టవచ్చు అనే వీరంతా నిరూపించారు.







