కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram project ) సురక్షితం కాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులే చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) అన్నారు.ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR )ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉపయోగం ఏం లేదన్నారు.మేడిగడ్డ బ్యారేజ్ కు మరమ్మతులు నిపుణులు సూచనల మేరకు జరుగుతున్నాయని తెలిపారు.
ఇంజినీర్లు మరియు నిపుణుల సూచనల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేచి చూస్తోందని స్పష్టం చేశారు.అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాకముందే పలు హామీలను అమలు చేశామని వెల్లడించారు.







