ఏపీలోని బీజేపీ ముఖ్యనేతలతో జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాశ్ భేటీ కొనసాగుతోంది.జిల్లాలకు సంబంధించిన కీలక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు.
రానున్న ఎన్నికల్లో పొత్తులు లేకుండా పోటీ చేయగలమా? లేదా? అనే అంశంపై శివప్రకాశ్( Shiv Prakash ) ఆరా తీస్తున్నారు.బీజేపీ బలంగా ఉన్న స్థానాల గురించి వివరాలు తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలో పొత్తులంటూనే టీడీపీ, జనసేన( TDP, Jana Sena ) సీట్లను ప్రకటించడం ఏంటని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

పొత్తు లేకుండా పోటీ చేస్తే పోటీకే పరిమితం అవుతాం తప్ప గెలుచుకునేదేం ఉండదని మరి కొంతమంది నేతలు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.అలాగే పార్టీ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పని చేస్తామని మరి కొందరు నేతలు చెబుతున్నారని తెలుస్తోంది.ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పొత్తులపై జాప్యం చేయకుండా క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెజార్టీ బీజేపీ నేతలు( BJP ) భావిస్తున్నారు.







