ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలు సమీపిస్తున్న కొలది పరిణామాలు మారిపోతున్నాయి.
ఈ క్రమంలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు విడుదల చేస్తున్న లిస్టులో తమ పేరు లేనివారు పార్టీలకు రాజీనామా చేసి ఇతర పార్టీలలో జాయిన్ అవుతున్నారు.ఈ రకంగానే పులివెందులలో సతీష్ రెడ్డి( Satish Reddy ) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నేడు సీఎం జగన్( CM Jagan ) సమక్షంలో వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ 27 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినట్టు చెప్పారు.కానీ తన కష్టానికి చంద్రబాబు విలువ ఇవ్వలేదని పేర్కొన్నారు.
వైసీపీ( YCP ) నుంచి పిలుపు వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకులు తనను కలిశారని అన్నారు.కానీ తాను వైసీపీలో చేరనన్నారు.చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోతుంది.ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది.సీనియర్లకు గౌరవం లేదు.తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థగా మారింది.
వైయస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టిన జగన్ నామీద ఎంతో ప్రేమ చూపించారు.ఈ ప్రేమ ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను.
అలాంటి మంచి ఫ్యామిలీ పై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది.సీఎం జగన్ ఏది చెబితే ఆ రకంగా ఎన్నికల్లో ముందుకెళ్తానని సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
జగన్ వెంటే ఉంటానని ఆయన కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు.