Radha Madhavam : గ్రామీణ ప్రేమ కథ రాధ మాధవం.. సినిమా ఎలా ఉందంటే!

గ్రామీణ నేపథ్యంలో ప్రేమ కథలు ఎలా ఉంటాయి, కులాంతర వివాహాలకి పెద్దవాళ్లు ఎలాంటి విలువ ఇస్తారు అనేది చాలా సినిమాలలో మనం చూసాము.అయితే రాధామాధవం( Radhamadhavam ) సినిమాలో చూపించే గ్రామీణ ప్రేమ కథ కూడా పరువు హత్యల నేపథ్యంలో ఉంటుంది.

 Village Love Story Radha Madhavam Movie-TeluguStop.com

వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ని దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు.గోనాల్ వెంకటేష్ నిర్మాతగా వ్యవహరించారు.మార్చి 1 న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఒక లుక్కేద్దాం.

కధ

రాధ( అపర్ణాదేవి ) మాధవ( వినాయక్ దేశాయ్ ) పేరు మీద కేర్ సెంటర్ పెట్టి తాగుడికి బానిసైన వాళ్ళని, అనాధ పిల్లల్ని, వృద్ధుల్ని చేరదీసి వారిని బాగు చేయటం వారికి పని కల్పించడం చేస్తుంది.అదే సమయంలో జైలు నుంచి తప్పించుకున్న వీరభద్రం ( మేక రామకృష్ణ ) దిక్కుతోచని స్థితిలో అక్కడికి వస్తాడు.వచ్చిన తరువాత తను వచ్చింది కూతురు దగ్గరికి అని తెలుసుకుంటాడు.

అసలు వీరభద్రం జైలుకెందుకు వెళ్ళాడు? తండ్రి కూతుర్ల మధ్య దూరం ఎందుకు వచ్చింది? రాధ మాధవ పేరు మీద కేర్ సెంటర్ ఎందుకు ప్రారంభించింది? రాధా మాధవ్ ల ప్రేమకి వీరభద్రం అడ్డుపడ్డాడా? ఇవన్నీ తెరమీద చూడాల్సిందే.

-Movie

నటీనటులు

వినాయక్ దేశాయ్ ( Vinayak Desai )మాధవ పాత్రలో చదువుకున్న గ్రామీణ యువకుడిగా తన ప్రేమను లక్ష్యాన్ని సాధించాలకునే కుర్రాడిగా కనిపించి మెప్పించాడు.రాధ పాత్రలో అపర్ణాదేవి( Aparnadevi ) కూడా ప్రేమికురాలిగా జీవించిందనే చెప్పాలి.మేక రామకృష్ణ( Meka Ramakrishna ) హీరోయిన్ తండ్రిగా, ఊరి పెద్దగా సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించి అదరగొట్టాడు.

మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేరకు పరవాలేదనిపించాయి.

-Movie

విశ్లేషణ

కులాల మధ్య ప్రేమల కాన్సెప్ట్ తో అనేక సినిమాలు వచ్చాయి.ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది.కాకపోతే కధని డైరెక్ట్ గా చెప్పకుండా ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు.

సినిమాలో ఎక్కువగా కులాల మధ్య చర్చలు, ప్రేమకు కులాలు అడ్డు రావటం, పరువు హత్యలు అనే అంశాన్ని గురించి ఎక్కువగా మాట్లాడారు.సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కొన్ని ఎమోషనల్ కి గురిచేస్తాయి.

ఒక వైపు ప్రేమ జంటలు, మరొకవైపు పగ చూపించే పెద్దలు అన్నట్లు ఫ్లాష్ బ్యాక్ అంతా సాగుతుంది.సినిమాలో హీరో లక్ష్యాన్ని ఒక ట్విస్ట్ లాగా ఆసక్తిగా చూపిస్తారు.

రేటింగ్: 3/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube