పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ( BJP ) వ్యూహా రచన చేస్తోంది.ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) మరోసారి తెలంగాణకు రానున్నారు.
ఈ మేరకు ఈనెల 5వ తేదీన రాష్ట్రంలో మోదీ పర్యటించనున్నారు.ఈక్రమంలోనే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో( Sanga Reddy ) బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు.
మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు, పార్టీ నేతలు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో భాగంగా సభా ఏర్పాట్లను పరిశీలించారు.