రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించి పేదల స్థితిగతులను అడిగి తెలుసుకున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయములో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేయకపోవడం వల్ల గత ఎనిమిది సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న నిరుపేదలు గ్రామ సభలో తమకు కేటాయించిన విధంగా తమ తమ ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉంటున్నారని వారికి ఇంటి పట్టాలు ఇచ్చి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
గత కొన్ని రోజులుగా పేదలను ఇబ్బందులకు గురి చేస్తూ మంచినీరు అలాగే విద్యుత్ నిలిపివేయడం జరిగిందని నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రకటించిదని గుర్తు చేశారు.
అలాగే గతంలో గ్రామసభ ఆమోదం పొంది రెవెన్యూ అధికారులు గడపగడపకు విచారణ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, మరి ప్రభుత్వం మారినాక అధికారులు పట్టాలు ఎందుకు ఇవ్వడంలేదని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పేదలకు ఇచ్చిన ఇండ్లకు పట్టాలు పంపిణీ చేయకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.స్థానిక ఎమ్మెల్యే పేద ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి పట్టాలు వచ్చే విధంగా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య,పసుల బాలరాజు, బైండ్ల మల్లేశం,మహేష్,నర్సవ్వ, రేణుక,లక్ష్మి,భాగ్యలక్ష్మి, చంద్రయ్య,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.







