రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గురువారం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 500 కే సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మాఫీ గ్యారెంటీలను అమలు పరచడం జరిగిందన్నారు.
పేద ప్రజల కోసం ఆరు గ్యారంటీలను అమలుపరిచి పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటుదాం అన్నారు .
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,రాజన్నపేట నాయకులు దేవరాజు ,భూపాల్ రెడ్డి ,బాపురెడ్డి ,నర్సింలు,బాలయ్య ,వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.







