టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో అనన్య నాగళ్ల( Ananya Nagalla ) ఒకరు.తెలుగులో హీరోయిన్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనన్య మల్లేశం సినిమాతో( Mallesham ) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఎక్కువగా అభినయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నారు.అనన్య నాగళ్ల తంత్ర( Tantra Movie ) అనే సినిమాలో నటించగా ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
మార్చి నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.తంత్ర సినిమాతో అనన్య మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
కెరీర్ తొలినాళ్లలో రొమాంటిక్ సీన్స్ లో నటించనని చెప్పిన ఈ బ్యూటీ ఆ సీన్స్ విషయంలో తన మనస్సు మారిందని కామెంట్లు చేశారు.తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో లిప్ కిస్ సీన్ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.
సినిమాకు ఆ సీన్ అవసరం అని ఆమె చెప్పుకొచ్చారు.

తంత్ర మూవీలో అన్ని అంశాలు ఉంటాయని గ్లామర్, రొమాంటిక్ సీన్స్, సోషల్ మెసేజ్ హారర్ ఇలా అన్ని అంశాలు ఉంటాయని అనన్య కామెంట్లు చేశారు.ఏడాదికి ఒకసారి మనిషి మారాలని అలా మారని పక్షంలో మన ఎదుగుదల అక్కడే ఆగిపోతుందని అనన్య చెప్పుకొచ్చారు.నటనలో రొమాంటిక్ సీన్స్( Romantic Scenes ) కూడా భాగమని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని ఆమె తెలిపారు.

అనన్య రొమాంటిక్ సాంగ్స్, సీన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆమె కెరీర్ పరంగా మరింత బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు చెబుతున్నారు.అనన్య కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అనన్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది.







