గుజరాతీ పాట అయిన ఖలాసీ( khalasi )సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.చాలా మంది ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ వారి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
విభిన్న డ్యాన్స్ స్టెప్పులతో అద్భుతమైన క్రియేటివిటీ, స్కిల్స్‌ను చాటుతున్నారు.తాజాగా ఈ పాటకు మరొక మహిళ డాన్స్ చేసింది.
ఆమె నాట్యానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.సదరు మహిళ ఆఫీసులో ఖలాసీ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తున్నట్లు మనం చూడవచ్చు.
ఆమె పేరు ఖుషీ చౌహాన్.ఈమె డాన్స్ బాగా నేర్చుకుంది.అందుకే వీడియోలో అంత బాగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంది.ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్( Instagram ) ఖాతాలో పోస్ట్ చేసింది.వీడియోలో, ఆమె సాంప్రదాయ దుస్తులు ధరించి ఆఫీస్ రూమ్ మధ్యలో నిలబడి ఉండటం మనం చూడవచ్చు.సహోద్యోగులు ఆమె చుట్టూ నిలబడి చూస్తున్నారు, కానీ వారు ఆమెను పెద్దగా పట్టించుకోకుండా అదిరిపోయే ఎనర్జీ ముచ్చటైన హావభావాలతో నృత్యం చేస్తుంది.
ఆమె పాట బీట్‌కి మ్యాచ్ అయ్యేలా కాలు కదిపింది.ఆమె డ్యాన్స్ చూడటానికి అద్భుతంగా అనిపించింది.
ఆమె వీడియోకు “నేను ఇప్పటికీ ఖలాసీ పాటను ప్రేమిస్తున్నా.ఇది నా 3 నిమిషాల డ్యాన్స్‌లో బెస్ట్ పార్ట్ భాగం.” అని ఒక క్యాప్షన్ జోడించింది.నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా ఫేమస్ అయింది.
దీనికి 1 కోటికి పైగా వ్యూస్, 5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.చాలా మంది ఖుషీ డ్యాన్స్ ను మెచ్చుకున్నారు.ఆమె సహోద్యోగులు ఆమెను ఎంకరేజ్ చేయకపోవడం విచారకరమని కొందరు పేర్కొన్నారు.వారు విసుగు లేదా అసూయతో ఉన్నారని చెప్పారు.ఇకపోతే ఖలాసీ పాటను కోక్ స్టూడియో ఇండియా ( Coke Studio India )రూపొందించింది.2023లో విడుదలైన ఈ పాటను ఆదిత్య గాధ్వి, అచింత్ తక్కా పాడారు.ఇది సముద్రాన్ని అన్వేషించడానికి ఇష్టపడే ఒక నావికుడి గురించిన పాట.అతను చాలా ప్రమాదాలు, సాహసాలను ఎదుర్కొంటాడు.