సాధారణంగా జంతువులు టీవీలు చూడడానికి ఇష్టపడుతుంటాయి.అవి అన్నిటినీ గ్రహిస్తూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాయి.
పులి, సింహం అంటే మృగాలు కూడా వేటాడే రొటీన్ నుంచి బ్రేక్ తీసుకొని కాసేపు సరదాగా ఆటలు చూస్తూ ఎంజాయ్ చేస్తాయి.తాజాగా ఓ పెద్ద మగ సింహం ఫుట్‌బాల్ గేమ్ చూస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
హంటింగ్ అండ్ వైల్డ్‌లైఫ్ బ్రీడింగ్ అనే ఇన్స్టాగ్రామ్( Instagram ) పేజీ ఈ వీడియో పోస్ట్ చేసింది, ఈ పేజీ దక్షిణాఫ్రికా నుంచి అనేక వీడియోలను పంచుకుంటుంది.అయితే రీసెంట్ గా ఆ పేజీ షేర్ చేసిన వీడియో ఎక్కడ తీసారో కచ్చితంగా తెలియదు.

వీడియోలో కొంతమంది యువకులు మైదానంలో ఫుట్‌బాల్( Football ) ఆడుతుండటం మనం చూడవచ్చు.వారికి కొంత దూరంలో రోడ్డుపై సింహం( Lion ) ఉన్నట్టు కనిపించింది.ఆ సింహం నిశ్శబ్దంగా కూర్చుని ఆటను ఆసక్తిగా చూస్తోంది.ఎవరిపైనా దాడి చేయాలనీ, వెంబడించాలన్నా కనిపించడం లేదు.ఈ వీడియోకు “ఫ్లేయింగ్ సాకర్ విత్ ఎ లయన్ యాజ్ ఎ ఫ్యాన్” అనే క్యాప్షన్ ఉంది.

చాలా మంది ఈ వీడియోపై కామెంట్స్ చేస్తూ జోకులు వేస్తున్నారు.“ఈ లయన్ లియోనెల్ మెస్సీ, అది పిల్లలు ఆడుకోవడం చూసి ఎంజాయ్ చేస్తోంది.” అని ఒకరు కామెంట్ చేశారు.“ఈ సింహం రిఫరీ, ఎవరు గెలుస్తారో అతను నిర్ణయిస్తాడు.” అని ఇంకొకరు సరదాగా కామెంట్ పెట్టారు.సింహాలు మనుషులు ఆడుకోవడమే కాదు ఇతర జంతువులు ఆడుకోవడం కూడా చూసి ఎంజాయ్ చేస్తా.ఈ వీడియో ఇంటర్నెట్లో చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది.దీనిని మీరు కూడా చూసేయండి.







