ఒకప్పుడు మాస్ యాక్షన్ సినిమాలను తీస్తూనే, రొమాంటిక్ లవ్ స్టోరీ లను తీస్తూ వీళ్ళను కూడా మెప్పిస్తూ ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ వస్తున్న హీరో నాగార్జున( Hero Nagarjuna ) … తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఫోర్ హీరోల్లో నాగార్జున కూడా ఒకరు కావడం విశేషం.ఇక వాళ్ళ నాన్న అయిన నాగేశ్వరరావు లెగసీని కంటిన్యూ చేస్తూ ముందుకు సాగడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీ అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక దానివల్లే ఆయన సూపర్ హిట్ సినిమాలను చేయడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కూడా తనకంటూ ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే నాగార్జునకి ఇష్టమైన స్టార్ హీరోలు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నాగార్జునకి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni Nageswara Rao )యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట.ఇక ఎప్పుడు ఆయన సినిమాలే చూస్తూ ఉండడం వల్ల ఆయన సినిమాలు అన్న, ఆయన అన్న ఎక్కువగా ఇష్టం ఉండేదట.ఇక ఆయన వాళ్ళ నాన్న కాబట్టి ఆయనకు ఇష్టం ఉండడంలో తప్పులేదు.కానీ ఆయన కాకుండా వేరే హీరోల్లో ఎవరంటే ఇష్టం అని నాగార్జునను అడగగా ఆయనకి మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ( Mohan Lal )అంటే అమితమైన ఇష్టమట.
వ్యక్తి పరంగా అయిన యాక్టింగ్ పరంగా, అయిన మోహన్ లాల్ అంటే నాగార్జునకి చాలా గౌరవం ఇష్టం ఉందట.

అందువల్లే మోహన్ లాల్ సినిమాలను ఎక్కువగా చూడడమే కాకుండా ఆయన నటనలో మెలకువలను కూడా పసిగడుతూ అప్పుడప్పుడు వాటిని అనుకరిస్తూ వాడట.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున స్క్రిప్ట్ లను వింటున్నాడట గత కొన్ని సంవత్సరాల నుంచి నాగార్జునకి సరైన సక్సెస్ లేదు.కాబట్టి ఇప్పుడు ఎలాగైనా ఒక సూపర్ సక్సెస్ కొట్టడమే లక్ష్యం పెట్టుకొని ముందుకు కదులుతున్నాడట…
.







