రాజకుమారుడు( rajakumarudu ) సినిమాతో మొదటి హిట్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు( Mahesh Babu ) ప్రిన్స్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వాళ్ళ నాన్నకి ఎలాంటి స్టార్ డమ్ అయితే ఉండేదో అంతటి క్రేజ్ ను సొంతం చేసుకొని ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో రేస్ లో కొనసాగుతున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు హీరోగా 28 సినిమాలు పూర్తి చేసుకున్నప్పటికీ, వాళ్ళ అక్క ఇందిరా ప్రొడక్షన్స్( Indira Productions ) అనే ఒక బ్యానర్ ని స్థాపించింది.
ఇక ఇప్పటివరకు మహేష్ బాబు ఆ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియనప్పటికీ మహేష్ బాబు ఒక సినిమా చేసి ఆమెకి మంచి సక్సెస్ ని ఇస్తే బాగుంటుందని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ బ్యానర్ కి కూడా వీళ్ళ అమ్మాయి అయిన ఇందిరా గారి పేరు పెట్టడం వల్ల ఆమె పరువు ప్రతిష్టలు పోకుండా ఉండాలంటే మహేష్ బాబు ఒక్కసారైనా వాళ్ల బ్యానర్ లో ఆమెకి సక్సెస్ ఇచ్చి మార్కెట్లోకి వదిలితే ఆమె సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగుతుందంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు మాత్రం రాజమౌళితో( Rajamouli ) పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.ఇక ఇప్పుడు దానికి సంబంధించిన మేకోవర్ లో మహేష్ బాబు రెడీ అయినప్పటికీ రాజమౌళి ఈ సినిమా కి సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు అందువల్ల ఈ సినిమాకి మరి కొద్ది రోజులు టైమ్ పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి…
.