మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఈ వయసులో కూడా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే రకం అనే సంగతి మనకు తెలిసిందే.ఎక్కడికి వెళ్లినా చాలా సింపుల్గా వెళ్తారు.
ఇకపోతే ఇటీవల పద్మ విభూషణ్ అవార్డును చిరంజీవికి ప్రకటించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇలా ఈ అవార్డు వచ్చిన తర్వాత ఈయన మొదటిసారి వరుణ్ తేజ్ ( Varun Tej ) హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి చాలా హుందాగా వ్యవహరించారు చూడటానికి చాలా సింపుల్ లుక్ లో కనిపించి సందడి చేశారు.అనంతరం సినిమాని అలాగే దర్శకులను ఉద్దేశిస్తూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈ వేడుకలో చిరంజీవి సింపుల్గా కనిపించినప్పటికీ ఈయన చేతికి ఉన్నటువంటి వాచ్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.దీంతో అభిమానులు చిరంజీవి చేతికి ఉన్నటువంటి వాచ్ ఏ బ్రాండ్ కు చెందినది దీని ధర ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఇప్పటికే చిరంజీవి దగ్గర ఎన్నో ఖరీదైన చేతి వాచీలు ఉన్న విషయం మనకు తెలిసిందే.అయితే చిరంజీవి ఈ సినిమా వేడుకలో కట్టుకున్నటువంటి ఈ వాచ్ ఏ లాంజ్ అండ్ స్నోహే అనే బ్రిటిష్ కంపెనీ( British company )కి చెందినటువంటి చేతి వాచీని కట్టుకొని కనిపించారు.ఇక ఈ వాచ్ ఖరీదు కూడా ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ఈ వాచ్ ఖరీదు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఏకంగా 50,56747 రూపాయలని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
అంటే దాదాపు అరకోటి రూపాయలు వాచ్ కోసం ఖర్చు చేశారని తెలుస్తుంది.