Rajinikanth : ప్రతి ఏడాది పెళ్లిరోజున రజనీకాంత్ దంపతులు ఆ పని చేస్తారా.. ఆదర్శ దంపతులు?

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ( Rajinikanth ) ఒకరు.ఈయన చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగారు.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రజినీకాంత్ తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.1981లో రజినీకాంత్, లతా ( Latha ) ని వివాహం చేసుకున్నారు.లతా కూడా సినిమా రంగంలో పని చేశారు.సింగర్‌గా, ప్రొడ్యూసర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా లతా పని చేసారు.

 Rajinikanth Celebrate His 43 Wedding Day Celebration-TeluguStop.com

ఇలా వీరిద్దరి 43 సంవత్సరాలకు కలిసి ప్రయాణం చేస్తూ ఎంతో ఆదర్శ దంపతులుగా ఉన్నారు.వీరిద్దరికి ఇద్దరి ఆడ పిల్లలు ఐశ్వర్య, సౌందర్య ఉన్న సంగతి తెలిసిందే.కాగా రజినీ కాంత్ పెళ్లి రోజు ( Wedding Day ) సందర్భంగా తన చిన్న కూతురు సౌందర్య సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.ఆ పోస్టుతో ప్రతి ఏడాది పెళ్లిరోజున రజినీకాంత్ దంపతులు ఏం చేస్తారో అందరికి తెలియజేసారు.

ఈ క్రమంలోనే సౌందర్య తన తల్లిదండ్రుల ఫోటో షేర్ చేశారు.ఇందులో రజినీకాంత్ తన మెడలోని గోల్డ్ చైన్, చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ కనిపిస్తున్నారు.అలాగే లతా ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తున్నారు.అవి 43 సంవత్సరాల క్రితం వారి పెళ్లిలో మార్చుకున్న ఉంగరాలు అని తెలిపారు.ప్రతి ఏడాది పెళ్లి రోజు తన తల్లితండ్రులు ఇలాగే చేస్తారు అంటూ సౌందర్య చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక వీరిద్దరి మధ్య అన్యోన్యత చూసి అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇద్దరు ఆదర్శ దంపతులు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube