మహేష్ బాబు( Mahesh Babu ) చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రి నటించిన సినిమాల్లో నటించినా 1999లో రాజకుమారుడు సినిమాతో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెలుగు తెరపై మొట్టమొదటిసారి మెయిన్ లీడ్ హీరోగా నటించారు.ఈ 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన అనేక మైలురాళ్లను అధిగమించారు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు మహేష్ బాబు.అయితే ఇన్నేళ్ల మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ఒకే పని ఉందట.
అదేంటంటే అతనికి రీమేక్ సినిమాల్లో నటించడం ఇష్టం ఉండదట.ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు కూడా మూల కథ తెలుగులోనే చేయబడ్డాయట.
తనకు రీమేక్ సినిమాలో నటించడం ఇష్టం ఉండదని, రీమేక్ అంటే మరొకరి శరీరంలో మన ఆత్మ ఉండడం లాంటిదే అని మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.తనకు కత్తి( Kaththi ) అని ఒక సినిమా చాలా ఇష్టమని కానీ ఆ సినిమా రీమేక్ చేయమని ఎంతమంది అడిగినా నేను చేయలేదని ఆ సినిమా చూస్తున్నంత సేపు నాకు విజయ్ తప్ప మరెవరు కనిపించలేదని ఆ పాత్ర నేను చేయాల్సి వస్తే విజయ్( Vijay ) నా మైండ్ లోనే ఉంటాడు తప్ప నేను ఆ పాత్రలో ఇమిడిపోలేనంటూ మహేష్ చెప్పారు.ఇది మాత్రమే కాదు ఎంతో మంది తనను రీమేక్ సినిమాల్లో నటించాలని మంచి సినిమాల చాలా అంటూ చెప్పారు కానీ అది నావల్ల కావడం లేదు అంటూ మహేష్ తెలుపుతున్నారు.
ఇప్పుడే కాదు ఎప్పటికీ తను రీమేక్ సినిమాల్లో నటించే ప్రసక్తి లేదు అంటూ తేల్చి చెప్పారు మహేష్ బాబు.ఆయన చెప్పినట్టుగానే మహేష్ బాబుకి రీమేక్ సినిమాలో నటించమని సలహా కూడా ఇప్పట్లో ఎవరు ఇవ్వడానికి ధైర్యం చేయరు.పైగా కేవలం ఈ విషయంలోనే కాదు ఆయన కొన్ని నియమాలు కెరియర్ మొదటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు.
అందులో ఒకటి తన బాడీకి సిక్స్ ప్యాక్ ఉన్నా కూడా ఎవరికి చూపించకూడదు అని నిర్ణయించుకున్నారట.అలాగే ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా తెలుగు సినిమాను వదిలి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని కూడా ఆయన భీష్మించుకుని కూర్చున్నారు.
ఇలాంటి నియమాల వల్లే ఆయన కృష్ణకు తగ్గ వారసుడుగా సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు.