సూర్యాపేట జిల్లాలోని మోతే( Mothey mandal )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు( RTC bus ) ఢీకొట్టింది.
సూర్యాపేట – ఖమ్మం జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు.
మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.మృతులు మునగాల మండలం( Munagala mandal ) రామసముద్రంకు చెందిన వారిగా తెలుస్తోంది.
ఉదయం కూలీలు మిరప కోతకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest Video Uploads News