తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్( Puri Jagannath ) కి ఉన్న క్రేజ్ మరే డైరెక్టరీకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ముఖ్యం 90స్ కిడ్స్ కి మాత్రం పూరి జగన్నాథ్ ఒక తోపు డైరెక్టర్ అనే చెప్పాలి.
టాలీవుడ్ లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో తను సినిమా చేయడమే కాకుండా ఇండస్ట్రీలో దర్శకుడిగా కూడా తను మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో వెంకటేష్ సినిమాలు చేశాడు ఇక వీళ్లిద్దరితో కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో వెంకటేష్ ఉన్నప్పటికీ దానికి సరైన సమయం మాత్రం దొరకడం లేదు.అయితే ఇప్పటికే వెంకటేష్, చిరంజీవి ( Venkatesh, Chiranjeevi )లతో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆయన ఎప్పటి నుంచో సన్నాహలు చేస్తున్నాడు.కానీ అది కార్యరూపం దాల్చడం లేదు.
వీళ్లతో సినిమాని చేయాలని పూరి జగన్నాథ్ చిరంజీవి, వెంకటేష్ లకి అయితే కథలు కూడా చెప్పాడట.దాంట్లో వెంకటేష్ కి కథ బాగా నచ్చినప్పటికి, చిరంజీవి మాత్రం ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పారట.
దాంతో మార్పులు చేర్పులు చేసిన తర్వాత చిరంజీవి మరొక సినిమా మీదికి వెళ్లిపోయాడు.ఇక అన్ని కుదిరితే పూరి డబల్ ఇస్మార్ట్ సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి, వెంకటేష్ లతో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇక ఇంతకుముందు వెంకటేష్ తో సపరేట్ గా ఒక సినిమా చేయాలని అనుకున్న కూడా ఆ సినిమా ఆగిపోవడంతో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో వీళ్లిద్దరు అన్నదమ్ములుగా నటించనున్నట్లు గా కూడా తెలుస్తుంది.ఇక ఇదొక రివెంజ్ డ్రామా గా ఉండబోతుందట…మరి ఈ సినిమా కార్యరూపం ఎప్పుడు దాలుస్తుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.







