టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా బండ్ల గణేష్ ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.అయితే తాజాగా బండ్ల గణేష్( Bandla Ganesh ) రోజా గురించి చేసిన విమర్శలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
రోజా డైమండ్ రాణి అని పులుసు రాణి అని ఆయన విమర్శలు చేశారు.రేవంత్ ఫైటర్ అని జగన్ యాక్సిడెంట్ సీఎం అని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.
తండ్రి చనిపోతే సీఎం అయిన వ్యక్తులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.
పులుసు వండిపెట్టావ్ కాబట్టి పులుసురాణి మాత్రమే కాదని ఐటమ్ రాణి అని బండ్ల గణేష్ ఒకింత అసభ్యంగా రోజా( Roja ) గురించి కామెంట్లు చేయడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
అయితే బండ్ల గణేష్ చేసిన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయంగా వేర్వేరు పార్టీలలో ఉన్నంత మాత్రాన మరీ హద్దులు దాటి విమర్శలు చేయడం రైట్ కాదని బండ్ల గణేష్ కు నెటిజన్లు సూచిస్తున్నారు.
బండ్ల గణేష్ మరీ హద్దులు దాటి కామెంట్లు చేయడం ఎంతవరకు సబబు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.బండ్ల గణేష్ ఇలాంటి విమర్శల వల్ల తన స్థాయిని తనే తగ్గించుకుంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బండ్ల గణేష్ ఈ నెగిటివ్ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.బండ్ల గణేష్ ప్రస్తుతం సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు.
ఒక చెక్ బౌన్స్ కేసు ద్వారా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది.బండ్ల గణేష్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయవద్దని సూచిస్తున్నారు.రోజాపై విమర్శలు చేయవచ్చు కానీ మరీ దారుణంగా విమర్శలు చేయడం ద్వారా తన స్థాయిని ఆయనే తగ్గించుకుంటున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.బండ్ల గణేష్ రాబోయే రోజుల్లో పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అవుతారేమో చూడాలి.