వచ్చే లోకసభ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్( BRS ) దానికి అనుగుణంగానే రాజకీయ వ్యూహాలు రూపొందిస్తుంది.ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ( Congress Government ) వైఫల్యాలే ప్రధాన ఆస్త్రాలుగా చేసుకుని ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలనే పట్టుదలతో బిఆర్ఎస్ ఉంది .
దీనిలో భాగంగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఆరు వారాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఫోకస్ చేసింది.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడకుండా జాగ్రత్త పడుతోంది.
ఈ మేరకు లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది.
నిన్ననే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్,( KCR ) కేటీఆర్ తో( KTR ) పాటు పార్టీ సీనియర్ నేతలతో ఈ విషయాలపై ప్రధానంగా చర్చించారు .ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాలేదు.ఆయన స్వల్ప జ్వరంతో ఉండడంతో కెసిఆర్, కేటీఆర్ ఆయనతో ఫోన్ లో మాట్లాడారు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నట్టు ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలకు కేసిఆర్ వివరించారు.బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలతో పాటు,
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో( Congress Manifesto ) ఇచ్చిన హామీలు, మూడు నెలల్లో వాటి అమలులో విఫలమైన తీరును వివరించే విధంగా కరపత్రాలు, బుక్ లెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు అసాధ్యం అనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కెసిఆర్ సూచించారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించి, మండల స్థాయి పార్టీ క్యాడర్ తో ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు సమావేశాలు ఏర్పాటు చేసే విధంగాను,
గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేయడంతో పాటు, టిఆర్ఎస్ పాలనలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితోనే వాటిని చెప్పించే విధంగా ప్లాన్ ను రూపొందించారు.నియోజకవర్గల వారీగా ముఖ్య నేతలకు సమన్వయ బాధ్యతలను అప్పగించబోతున్నారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి ,మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్ నేతలకు ఈ బాధ్యతలను అప్పగించబోతున్నారు.