బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( BJP MP Bandi Sanjay ) నిర్వహిస్తున్న పర్యటనలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం( Husnabad Constituency )లోని రాములపల్లిలో బీజేపీ ప్రజాహిత యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ శ్రేణులు( BJP Activists ) వారిపై దాడికి దిగారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.
కాగా ఈ ఘర్షణలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.దీంతో రాములపల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.







