Bangalore Metro : మెట్రోలో రైతుకు ఘోర అవమానం.. మురికి బట్టలు ధరించాడని ట్రైన్ ఎక్కనివ్వలే!

ఈ దేశంలో ఎవరికీ గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా రైతుకి జవాన్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గౌరవించాలి.రైతు లేకపోతే మనం తినడానికి తిండి ఉండదు, జవాన్ లేకపోతే మన కంటి నిండా నిద్ర ఉండదు.

 Farmer Denied Entry Into Bengaluru Metro For His Clothes Video Viral-TeluguStop.com

కానీ కొందరు ఈ విషయాన్ని మరిచి వారి అట్లా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు.తాజాగా బెంగళూరులోని( Bangalore ) ఓ మెట్రో స్టేషన్‌లోని సెక్యూరిటీ సూపర్‌వైజర్ రైతును( Farmer ) రైలు ఎక్కనివ్వలేదు.

రైతు బట్టలు చాలా మురికిగా ఉన్నాయని ఎక్కనివ్వనని కరాకండిగా చెప్పేసాడు.ఎంత విషాదకరమైన విషయం ఏంటంటే, ఈ రైతు కష్టంతో సంపాదించిన డబ్బుతో టికెట్ కూడా కొనుగోలు చేశాడు.

అయినా సూపర్‌వైజర్ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లకుండా అడ్డుకున్నాడు.ఇది ఆదివారం (ఫిబ్రవరి 26) రాజాజీనగర్ మెట్రో స్టేషన్‌లో( Rajajinagar Metro Station ) జరిగింది.ఈ ఘటనను చూసిన కొందరు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వారిలో ఒకరైన కార్తీక్( Karthik ) రైతు పక్షాన నిలబడి సూపర్‌వైజర్‌తో వాగ్వాదానికి దిగాడు.కార్తీక్ తన వాదనను వీడియో రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో పంచుకున్నాడు.రైతు పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని సూపర్‌వైజర్‌ను( Supervisor ) వీడియోలో ప్రశ్నించారు.

మెట్రో అనేది కేవలం వీఐపీల కోసమే కాదని, అందరి కోసం అని అన్నారు.

మెట్రోలో ప్రయాణించాలంటే ప్రజలు శుభ్రమైన దుస్తులు ధరించాలనే లిఖితపూర్వక నిబంధనను తనకు చూపించాలని సూపర్‌వైజర్‌ను కోరారు.సూపర్‌వైజర్ అతనికి సమాధానం చెప్పలేకపోయాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ కావడంతో చాలా మంది కార్తీక్, రైతుకు మద్దతు తెలిపారు.

ఈ వీడియోను చూసిన మెట్రో సంస్థ బీఎంఆర్సీఎల్ చర్యలు చేపట్టింది.దురుసుగా ప్రవర్తించినందుకు సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేశారు.అలాగే రైతుకు, ప్రజలకు క్షమాపణలు చెప్పారు.చివరకు రైల్ ఎక్కి గమ్యస్థానానికి వెళ్లేందుకు రైతును అనుమతించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube