ఏపీలో మరో రెండు నెలల ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి ఎన్నికలలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ( Congress ) కీలకంగా రాణిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు బాధ్యతను షర్మిల పుచ్చుకున్న తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేతలు క్యాడర్ మళ్లీ యాక్టివ్ అయ్యారు.ఈ క్రమంలో సోమవారం అనంతపురం పట్టణం న్యూ టౌన్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తొలి ప్రచార సభ నిర్వహించింది.
ఈ సభకి ముఖ్య అతిథులుగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే( Mallikarjuna Kharge ) ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఇతర రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వైయస్ షర్మిల.
వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది.విభజన హామీల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విమర్శించారు.
ఆనాడు తిరుపతి సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని.నిలదీశారు.
చంద్రబాబు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా( AP Special Status ) ఇవ్వాలని అన్నారు.ఆ తర్వాత అధికారంలోకి వచ్చి.ప్రత్యేక హోదా అంటే సంజీవనా.? ప్రత్యేక హోదా అవసరం లేదు ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటామని మాట మార్చారు.ఆ సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాడితే చంద్రబాబు( Chandrababu ) కేసులు పెట్టారు.ఆరోజు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్.ప్రత్యేక హోదా కోసం.ఎన్నో దీక్షలు చేశారు.
ప్రత్యేక హోదా కోసం ఎంపీలందరూ ముక్కుమ్మడిగా రాజీనామా చేద్దామని పెద్దపెద్ద డైలాగులు వేశారు.అప్పుడు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తుందని అన్నారు.
ఆ తర్వాత ప్రత్యేక హోదా జగన్ గారు సాధిస్తారని ప్రజలు ఓటేస్తే.ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా కోసం ఒక్కటంటే ఒక్క పోరాటం కూడా చేయలేదు.
దీంతో ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాకపోవడంతో పిల్లలకు ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి నెలకొంది.రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఒక పక్క చంద్రబాబు మరొక పక్క జగన్( YS Jagan ) అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకు ఆంధ్రలోనే ఉంటా.చెల్లి అని చూడకుండా మీ సోషల్ మీడియాలో నన్ను దూషిస్తున్నారు.
నీకోసం ఇదే చెల్లెలు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నడిపించలేదా.? జగన్ మీరేం చేస్తున్నారో.దేవుడు చూస్తున్నారు.నేను వైఎస్ఆర్ బిడ్డను భయపడను అని షర్మిల.అనంతపురం “న్యాయ సాధన సభ” లో సంచలన ప్రసంగం చేశారు.