పార్వతీపురం( Parvathipuram ) మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో దొంగలు బీభత్సం సృష్టించారు.కిమిడి శ్రీరామచంద్రమూర్తి నాయుడు అనే వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు భార్యాభర్తలపై దాడికి పాల్పడ్డారు.

అనంతరం దంపతులను తాళ్లతో కట్టేసి ఇంటిని దోచుకున్నారు.ఈ క్రమంలోనే సుమారు కేజీ బంగారం( Gold ), రెండు లక్షల నగదుతో పాటు సీసీ కెమెరాల( CC cameras ) హార్డ్ డిస్కును సైతం దొంగలు ఎత్తుకెళ్లారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







