టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ మూల స్తంభాలుగా నిలబెట్టారు.ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటిస్తూనే ఏదైనా సమస్య వచ్చినా కూడా ముందు నిలబడి ఆదుకునేవారు.
వీరి తరం తర్వాత కృష్ణ, శోభన్ బాబులు ఆ పని చేస్తూ వచ్చారు.వీరి సినిమాలు ఎక్కువగా అభిమానుల అభిమానాన్ని చూరగొనేవి.
అయితే కృష్ణ తో పాటు శోభన్ బాబు( Sobhan Babu ) ఇండస్ట్రీకి వచ్చిన శోభన్ బాబుకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు.ఆయన సినిమా వస్తుంది అంటే అందులో ఎలాంటి డబల్ మీనింగ్స్ డైలాగ్స్ లేకుండా చాలా క్లీన్ గా ఉంటాయని ఫీలింగ్ ఉండేది.

అందుకే ఆ హీరోలతో నటించడానికి ఎక్కువగా హీరోయిన్స్ ఉబలాట పడుతూ ఉండేవారు.ముఖ్యంగా సీనియర్ హీరోయిన్స్ అయినా జయసుధ,( Jayasudha ) జయప్రద,( Jayaprada ) శారదా,( Sharada ) సుజాత, వాణిశ్రీ, శ్రీదేవి లాంటి హీరోయిన్స్ అయితే ఆయన సినిమాలో ఒక్క ఛాన్స్ రావాలని ఎదురు చూసేవారు.వరుసబెట్టి అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ కూడా శోభన్ బాబు సినిమా( Sobhan Babu Movie ) ఆఫర్ వచ్చిందంటే ఎగిరి గంతేసే వాళ్ళు ఈ హీరోయిన్స్.అందరితోనూ శోభన్ బాబు వరుస సినిమాల్లో నటించారు.
అయితే ఈ హీరోతో నటిస్తే హీరోయిన్స్ కి కూడా వాల్యూ పెరుగుతుందని మంచి సినిమా తీసిన ఫీలింగ్ వస్తుందనేది అప్పటి హీరోయిన్స్ యొక్క అభిప్రాయం.

అందుకే ఆయనతో పాటు నటిస్తూ ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఆ తరం హీరోయిన్ అంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవారట.శోభన్ బాబు హీరోగా చలామణి అవుతున్న టైంలో ఆయన యొక్క క్రేజ్ మామూలుగా ఉండేది కాదు.ఆయన కోసం చాలామంది లేడీ ఫ్యాన్స్ ఎదురు చూసేవారు.
ఆయన సినిమా వస్తే థియేటర్ కి కూడా లేడీ అభిమానులు ఎక్కువగా వచ్చేవారు.ఎక్కువగా ఎన్టీఆర్( NTR ) సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అక్కినేని( Akkineni ) సినిమాల్లో డబల్ మీనింగ్స్ తో కూడిన డైలాగ్స్ ఉంటాయి.
ఈ రెండిటికీ శోభన్ బాబు విరుద్ధంగా ఉండేవాడు.అందుకే శోభన్ బాబుతో నటించాలంటే హీరోయిన్స్ అందరికీ ఎంతో ఇష్టం.







