బాలయ్య బాబు( Balakrishna ) హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య తెలుగు లో ఉన్న దర్శకులతోనే కాకుండా మిగితా దర్శకులతో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే మలయాళ దర్శకుడు అయిన ప్రియదర్శన్ దర్శకత్వంలో బాలయ్య బాబు గాండీవం( Gandeevam ) అనే సినిమా చేశాడు.ఈ సినిమాలో బాలయ్య బాబుతో పాటు ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నాగేశ్వరరావు కూడా నటించాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక మిస్ కమ్యూనికేషన్ వల్ల నాగేశ్వరావు( Nageswara Rao ) బాలయ్య మీద అరిచాడనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే నాగేశ్వరరావు, బాలయ్య కి మధ్య ఒక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు నాగేశ్వరరావు చెప్పాల్సిన డైలాగులు బాలయ్య బాబు చెప్పాడట.ఇంకో పక్క నాగేశ్వరరావు చెప్తుంటే అవే డైలాగులను బాలయ్య కూడా చెప్పాడట.దాంతో నాగేశ్వరరావు బాలయ్య మీద అరిచాడట.ఆ వెంటనే డైరెక్షన్ టీమ్ వచ్చి సారీ సర్ నాగేశ్వర రావు గారు చెప్పాల్సిన డైలాగ్స్ పేపర్( Dialogues Paper ) మీకు వచ్చింది అని బాలయ్య తో చెప్పాడట…

ఇక మొత్తానికైతే అది అలా జరిగిపోయింది… ఇక బాలయ్య బాబు, నాగేశ్వరరావు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి.ప్రియదర్శన్( Priyadarshan ) డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరు అనుకున్నారు.కానీ ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఇక ఈ సినిమా తర్వాత ప్రియదర్శన్ బాలయ్య తో మరో సినిమా చేయాలనుకున్నాడు.కానీ బాలయ్య మాత్రం ఆయనకు డేట్స్ ఇవ్వలేదు అయితే ప్రియదర్శన్ మలయాళం లో టాప్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాల పాటు వెలుగొందాడు.
ఆ కారణం చేత తెలుగులో కూడా ఆయనకు మంచి అవకాశాలు అయితే వచ్చాయి.కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవడంలో ఆయన చాలా వరకు తరబడ్డాడనే చెప్పాలి…
.