అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం( Kalyandurg Mandal ) వర్లి గ్రామంలో చిరుతలు హల్ చల్ చేయడంతో తీవ్ర కలకలం చెలరేగింది.మండలంలో మొత్తం రెండు పెద్ద చిరుతలతో పాటు రెండు చిన్న చిరుతలు( Chirutha ) సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు( Forest officials ) చిరుతల సంచారం నేపథ్యంలో గస్తీ కాస్తున్నారు.ఇందులో భాగంగానే గ్రామంలోకి చిరుతల రాకుండా అధికారులు టపాసులు కాలుస్తున్నారు.