తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) ఉన్న స్టార్ డమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన చేయని సినిమా లేదు.
ఆయన పోషించని పాత్ర లేదు.ప్రతి పాత్రలో తనదైన నటనను కనబరచడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు.
అందుకే చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవితో సినిమాలు చేస్తామని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) చిరంజీవితో ఒక సినిమాని స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ షూటింగ్ ని కూడా పూర్తి చేసిన తర్వాత ఆయనకి బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో ఈ సినిమాను మధ్యలోనే వదిలేసి చెప్పపెట్టకుండా వర్మ బాలీవుడ్ చెక్కేశాడు.దాంతో చిరంజీవి విపరీతమైన కోపానికి వచ్చాడు…ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనతో సినిమా చేయడానికి చిరంజీవి ఇష్టపడటం లేదు…ఇక చిరంజీవితో చాలా రోజులపాటు సినిమా చేస్తాను అని ఊరించి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్ మణిరత్నం.
చిరంజీవితో మణిరత్నం( Maniratnam ) అప్పట్లో ఒక సినిమా చేయాల్సి ఉంది.కానీ మణిరత్నం మాత్రం చిరంజీవికి సరిపడా సబ్జెక్టుని రెడీ చేస్తున్నాను అంటూ చాలా రోజులపాటు అలాగే గడిపాడు.ఇక చివరికి చిరంజీవి ఇమేజ్ కి సెట్ అయ్యే కథ రెడీ కావడం లేదనే ఉద్దేశ్యంతో ఇప్పటివరకు కూడా చిరంజీవితో సినిమా చేయలేదు.
చిరంజీవి కూడా విసిగిపోయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పిన కూడా చిరంజీవి ఆయనకు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు…ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు…
.