తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో బాలయ్య బాబు( Balayya Babu ) ఒకరు.ఈయన హీరోగా చేసిన సింహ సినిమాలో( Simha Movie ) నయనతార( Nayantara ) పోషించిన పాత్ర కోసం మొదట వేరే హీరోయిన్ తీసుకుందామని అనుకున్నారట.
కానీ బోయపాటి శీను( Boyapati Srinu ) క్యారెక్టర్ కి నయన తార అయితేనే బాగుంటుందని ఫైనల్ గా నయనతారని తీసుకున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే.
అయితే అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబుని ఒక్కసారిగా మళ్లీ స్టార్ హీరోగా మార్చిన సినిమా సింహా… అయితే ఈ సినిమాలో బాలయ్య మొదట ఛార్మిని తీసుకుందామని అనుకున్నారట, కానీ బోయపాటి వద్దని చెప్పడంతో ఆయన నిర్ణయాన్ని విరమించుకున్నాడు.

ఇక అంతకు ముందే బాలయ్య బాబుతో ఛార్మి తో( Charmi ) అల్లరి పిడుగు( Allari Pidugu ) అనే సినిమాలో నటించింది.అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు తో పాటు మంచి జోడీగా పేరు తెచ్చుకున్న ఛార్మినే మళ్లీ ఈ సినిమా కోసం రిపీట్ చేద్దామని బాలయ్య బాబు అనుకున్నాడు.కానీ బోయపాటి మాత్రం వద్దని వారించడంతో నయనతార కి ఫిక్స్ అయ్యారు.
ఇక ఈ పాత్రలో నయనతార నటించి మెప్పించింది.అలాగే ఆ పాత్రలో ఆమె చెప్పిన డైలాగులు కూడా ఆమెకి మంచి గుర్తింపును తీసుకువచ్చాయనే చెప్పాలి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు బాలయ్య, ఇటు బోయపాటి మంచి హిట్లను అందుకున్నారు.ఇక అప్పుడు మొదలైన వీళ్ళ కాంబో ఇప్పటివరకు మూడు సినిమాలు చేస్తే మూడు సినిమాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి.నాలుగో సినిమాగా మరొక సినిమాని కూడా చేయడానికి రెఢీ అవుతున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో కూడా మరోసారి బాక్సాఫీస్ కి వాళ్ళ పంజా దెబ్బ ని రుచి చూపించాలని చూస్తున్నారు…
.







