మంచి ఆరోగ్యానికి ఎక్కువ నీరు తాగడం తప్పనిసరి ఇది మన అందరికీ తెలిసిన విషయమే.అయితే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటే రక్త ప్రసరణ కూడా సాఫీగా జరుగుతుంది.
కానీ పరిమితి దాటితే మాత్రం అమృతం కూడా విషంగా మారుతుందని నానుడి కూడా మర్చిపోకూడదు.ఎందుకంటే నీళ్లు ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి హానికరం అని అంటున్నారు నిపుణులు.
సరైన సమయంలో సరైన మోతాదులో నీరు తాగడం వలన దాని పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.ఎక్కువ నీరు తాగడం వలన కలిగే నష్టాన్ని వాటర్ పాయిజనింగ్ అని అంటారు.
అంటే నీరే విషంగా మారి శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
దీని వలన వాటర్ టాక్సిసిటీ( Water Toxicity ) అని ఆరోగ్య సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఎక్కువ నీరు మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపిస్తుంది.కిడ్నీలు ఎక్కువగా పనిచేసి, బలహీనపడే అవకాశం ఉంటుంది.
అదనంగా ఎక్కువ నీరు శరీరంలో సోడియం, ఎలక్ట్రోలైట్స్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది.అవి సమతుల్యతను కోల్పోతే అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నిర్ణీత వ్యవధిలో నీరు తాగాలి.కొంతమంది చాలా సేపు నీళ్లు తాగకుండా ఉండి ఒకేసారి చాలా నీరు తాగుతారు.
ఇది మూత్రపిండాలను ప్రభావితం చేయడమే కాకుండా కాలేయం, గుండె పని తీరుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
అలాగే మనలో చాలామందికి భోజనం తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.కానీ నిపుణులు చెప్పిన ప్రకారం తిన్న ఒక అరగంట తర్వాత నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు తిన్న తర్వాత ఎక్కువ నీళ్లు తాగడం వలన జీర్ణ వ్యవస్థ( Digestive system ) పై ప్రభావం పడుతుంది.మూత్రంలో అవసరమైన పోషకాలు విసర్జించబడతాయి.
అలాగే వ్యాయామం చేసిన తర్వాత కూడా నీళ్లు ఎక్కువగా తాగకూడదని చెబుతున్నారు.వ్యాయామం చేసే సమయంలో మనకు ఎక్కువ చెమట పట్టడం వలన దాహం వేస్తుంది.
కాబట్టి ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగితే ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది.అలాగే జలుబు లేదా దగ్గు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి నీటిని కూడా మితంగా తాగడం మంచిది.