తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర( Medaram Maha Jathara )లో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.నాలుగు రోజుల ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సమ్మక్క గద్దెపైకి రానుంది.
ఈ మేరకు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని ఆదివాసీ పూజారులు గద్దెపైకి తీసుకురానున్నారు.ఉదయం గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అనంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు.
ఈ క్రమంలోనే చిలకలగుట్ట( Chilakalagutta )లో కుంకుమ భరిణ రూపంలో సమ్మక్కను ప్రతిష్టిస్తారు.ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరుకున్నారు.అయితే జాతరలో ఈ రోజు కీలకం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
కాగా ఈ మహాజాతరకు తెలంగాణ( Telangana ) రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.