ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) అన్నారు.వైసీపీ నిర్వహిస్తున్న ‘సిద్ధం( Siddham Meeting )’ బహిరంగ సభలు కనివినీ ఎరుగని రీతిలో సక్సెస్ అవుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మార్పులు చూస్తే అర్థం కావడం లేదా అని ప్రశ్నించిన అంబటి తాము ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలో నిలస్తున్నామో తెలియడం లేదా అని చెప్పారు.

ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఛాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని తెలిపారు.ఎన్నికలకు సింగిల్ గా రాలేని వాళ్లు సవాళ్లు చేయడం ఏంటని ప్రశ్నించారు.సీఎం జగన్ కు( CM Jagan ) సవాల్ చేసే సత్తా నారా కుటుంబానికి కానీ, పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )కు కానీ లేదని చెప్పారు.
వారాహి ఏమైందన్న ఆయన మూడు సిద్ధం సభలు చూసిన తరువాత కూడా ఎవరు అధికారంలోకి వస్తారో అర్థం కావడం లేదా అని అడిగారు.పవన్ ఆటలో అరటి పండని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు రా కదలి రా అంటే ఎవరు కదలట్లేదు, రావట్లేదన్న మంత్రి అంబటి శంఖారావం పేరును పలకడం కూడా లోకేశ్ కు రావడం లేదని విమర్శించారు.







