ఏపీలో వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా ( YSR Kalyanamastu, Shaadi Tofa )ఐదో విడత నిధులు విడుదల అయ్యాయి.ఈ మేరకు 2023 అక్టోబర్ – డిసెంబర్ లో వివాహం చేసుకున్న జంటలకు వైసీపీ( YCP ) ప్రభుత్వం పెళ్లి కానుక అందజేసింది.ఈ నేపథ్యంలో అర్హులైన సుమారు 10,132 మంది లబ్ధిదారులకు రూ.78.53 కోట్లను అందించింది.ఇప్పటివరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.427.27 కోట్లను సీఎం జగన్ సర్కార్ జమ చేసింది.వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా ఐదో విడత నిధుల విడుదల అనంతరం సీఎం జగన్( CM Jagan ) మాట్లాడుతూ 10,132 మంది జంటలకు ఇవాళ్టి నుంచి మంచి జరుగుతుందని చెప్పారు.వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేశామన్నారు.
వధువు కనీస వయసు 18, వరుడికి 21 ఏళ్లుగా నిర్దేశించామని సీఎం జగన్ తెలిపారు.