వికారాబాద్ జిల్లా కొడంగల్ లో రేపు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటించనున్నారు.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి( Kodangal Constituency ) ఆయన తొలిసారి సీఎం హోదాలో వెళ్తున్నారు.
ఈ మేరక కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ( Congress party ) శ్రేణులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.అయితే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రానికి రాష్ట్రానికి చేరుకోనున్నారు.