సాధారణంగా భారతీయ వివాహాలలో వరుడు గుర్రంపై స్వారీ చేస్తూ వెడ్డింగ్ వెన్యూకి వస్తాడు, లేదంటే ఊరేగింపులో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.గుర్రంపై వరుడు వస్తుంటే అతిథులు అతని చుట్టూ చేరి డ్యాన్స్ చేస్తూ ఒక పండగ వాతావరణం నెలకొల్పుతారు.
అయితే ఇటీవల కూడా ఒక పెళ్ళిలో ఇలాగే వరుడు గుర్రంపై స్వారీ ( horse )చేస్తుండగా అతడి చుట్టూ చేరి కొంతమంది డాన్స్ చేశారు.ఒక వ్యక్తి మాత్రం అత్యుత్సాహంతో ఎక్స్‌ట్రాలు చేసి గుర్రంతో తన్నించుకున్నాడు.
దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లిలో గుర్రం దగ్గర ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తుండడం వైరల్ వీడియోలో మనం చూడవచ్చు.
గుర్రం అతనిని గట్టిగా తన్నడంతో అతను ఎగిరి కింద పడిపోతాడు.ఈ వీడియో బాగా పాపులర్ కావడంతో నెటిజన్లు జోకులు వేస్తున్నారు.
ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు.ఈ వీడియో చూశాక పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో గుర్రాలను వాడకూడదని కొందరు అంటున్నారు.
గుర్రాలు పెద్ద శబ్దాలు, పెద్ద సమూహాలను చూసి భయపడతాయని, కోపంగా ఉంటాయని తెలిపారు.

గుర్రాలకు పెళ్లిళ్లు చాలా ఒత్తిడిని కలిగిస్తాయని, అవి ప్రమాదాలకు కారణమవుతాయని పెటా అధికారులు( PETA officials ) కూడా అంటున్నారు.పెళ్లిళ్లు లేని సమయంలో గుర్రాలను హీనంగా చూస్తారని, వాటికి ఆహారం కూడా పెట్టరని మరికొందరు అన్నారు.యజమానులు వాటిని ఈగలు, మురికి ప్రదేశాలలో కట్టేస్తారని అవి చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాయని మరికొందరు అన్నారు.
అంతే కాదు వాటిని దారుణంగా కొట్టేస్తూ కంట్రోల్ చేస్తుంటారు.

పెళ్లిలో గుర్రాలను ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి కాదు.2022, జులైలో, ఉత్తరప్రదేశ్‌లోని ( Uttar Pradesh ) ఒక గుర్రం చాలా మంది అతిథులను తన్నింది.వారు ఆసుపత్రికి వెళ్లవలసి వచ్చింది.2021లో, అజ్మీర్‌లోని ఒక గుర్రం వరుడిని తన వీపుపై నుంచి పడేసి పారిపోయింది.అతిథులు గుర్రం వెంట నాలుగు కిలోమీటర్లు పరుగెత్తాల్సి వచ్చింది.
అదృష్టవశాత్తూ, వరుడు, గుర్రం గాయపడలేదు.వరుడు సమయానికి పెళ్లికి చేరుకున్నాడు.







