ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో 12th ఫెయిల్( 12th Fail Movie ) ఒకటి.ఈ సినిమాలో విక్రాంత్ మస్సే హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
విక్రాంత్ మస్సే( Vikrant Massey ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవించానని చెప్పుకొచ్చారు.ఒకప్పుడు లక్షల్లో వేతనం వచ్చిందని ప్రస్తుతం భార్య ఇచ్చిన డబ్బులతో నెట్టుకొస్తున్నానని ఆయన తెలిపారు.
అప్పట్లో నెలకు 35 లక్షల రూపాయలకు పైగా సంపాదన వచ్చేదని విక్రాంత్ మస్సే చెప్పుకొచ్చారు.ఒకప్పుడు సీరియల్స్ లో నటించిన విక్రాంత్ మస్సే ప్రస్తుతం ఓటీటీలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.
లక్షల పారితోషికం వచ్చే సీరియళ్లను వదులుకున్న తర్వాత ఇంటి ఖర్చులకు సైతం ఇబ్బందులు పడ్డానని విక్రాంత్ మస్సే వెల్లడించారు.
అడిషన్స్ కు వెళ్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని ఆ సమయంలో భార్య శీతల్ ఠాకూర్( Sheetal Thakur ) సహాయం చేసిందని విక్రాంత్ మస్సే వెల్లడించారు.నాలుగైదు నెలల పాటు ఖర్చులకు డబ్బులు ఇచ్చి నా భార్య ఆదుకుందని ఆయన అన్నారు.ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ వల్ల విక్రాంత్ మస్సే వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉండటం గమనార్హం.
విక్రాంత్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.విక్రాంత్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.రాబోయే రోజుల్లో విక్రాంత్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుని స్టార్ గా ఎదుగుతారేమో చూడాల్సి ఉంది.విక్రాంత్ మస్సే తెలుగు ప్రాజెక్ట్ లపై ఎక్కువగా దృష్టి పెడుతుండటం గమనార్హం.
ఇతర భాషల్లో సైతం విక్రాంత్ మస్సే మరింత సక్సెస్ సాధించాల్సిన అవసరం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.