భీమవరం పర్యటనకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.మామూలుగా ఫిబ్రవరి 14వ తారీకు పవన్ కళ్యాణ్ భీమవరం( Bhimavaram ) పర్యటన చేపట్టాల్సి ఉంది.
ఆ సమయంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతులు రాలేదు.దీంతో పవన్ భీమవరం పర్యటన రద్దయింది.
అనంతరం ఫిబ్రవరి 20వ తారీకు పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు అయినట్లు భీమవరం జనసేన నాయకులు ప్రకటించారు.కానీ ఇప్పుడు స్వల్ప మార్పు చోటు చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి 20వ తారీకు బదులు 21వ తారీకు నాడు భీమవరంలో పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్ తెలిపారు.
ఫిబ్రవరి 21వ తారీకు నాడు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని స్పష్టం చేశారు.అంతేకాదు 2024 ఎన్నికలలో( 2024 Elections ) పవన్ కళ్యాణ్ మరోసారి భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నాయకులంతా కోరుకున్నట్లు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కి సంబంధించి అన్ని అనుమతులు కూడా తీసుకున్నట్లు స్పష్టం చేశారు.2019 ఎన్నికలలో భీమవరం నుండి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.అయితే మరోసారి ఇక్కడ నుండే పోటీ చేయాలని ఈసారి గెలిపించుకుంటామని.
భీమవరం జనసేన పార్టీ క్యాడర్ మరియు నాయకులు తెలియజేస్తున్నారు.