అప్పుడప్పుడు మూగజీవులు ప్రమాదాల్లో పడుతుంటాయి.వాటి నుంచి సొంతగా బయటపడలేక నానా తిప్పలు పడుతుంటాయి.
అయితే కొందరు మనుషులు పెట్టిన చూసి జాలిపడి కాపాడుతుంటారు.తాజాగా ఒక వ్యక్తి ప్రమాదంలో చిక్కుకుపోయి నిస్సహాయక స్థితిలో ఉన్న ఓ హంసని( swan ) కాపాడి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాడు.

కష్టాల్లో ఉన్న ఆ హంసకు సంబంధించి ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.హంస పరిస్థితిని చూసి చాలా మంది అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు.గుర్తు తెలియని ప్రదేశంలో హంసను చూసిన ఒక స్థానికుడు దీనిని వీడియో తీశాడు.దానిని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశాడు.హంస కంచెలో ఇరుక్కుపోయినట్లు వీడియోలో మనం చూడవచ్చు.హంస చాలాసార్లు కంచె లేదా ఫెన్స్ నుంచి తనని తాను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించి ఫెయిల్ అయినట్లుంది.
అందుకే అది బాగా అలసిపోయి బలహీనంగా కనిపిస్తోంది.అదృష్టవశాత్తూ, మరొక వ్యక్తి వచ్చి హంసను చూశాడు, జాలిపడ్డాడు.
చాలా జాగ్రత్తగా హంసను బాధించకుండా కంచె నుంచి విడిపించాడు.

సోషల్ మీడియాలో ఈ వీడియోకు 2 కోట్లకు పైగా ప్రజలు చూశారు.హంసను ప్రమాదకరమైన పరిస్థితి నుంచి రక్షించడం ఇదే మొదటిసారి కాదు.యూకేలో( UK ), అగ్నిమాపక సిబ్బంది కెనాల్ లాక్ ( Canal lock )నుంచి ఓ హంసను రక్షించారు.
ఈ ఘటనలో హంస ఒక గేటు, గోడ మధ్య ఇరుక్కుపోయింది.గేటు తెరిస్తే హంస నలిగిపోయేది.కానీ అదృష్టం కొద్దీ అలా జరగలేదు.ఇకపోతే స్వాన్స్ చాలా ఎమోషనల్ జంతువులు.
అవి భాగస్వామిని లేదా పిల్లలను కోల్పోయినప్పుడు చాలా బాధపడతాయి.కొన్ని హంసలు ఆత్మహత్య కూడా చేసుకుంటాయి.
ఇవి తినడం మానేయవచ్చని లేదా ఉద్దేశపూర్వకంగా ఇంటిలో మునిగి చచ్చిపోవచ్చని కొందరు చెబుతుంటారు.







