చాలా మంది బ్రెడ్‌ను తినేటప్పుడు దానితోపాటు ఏదైనా స్వీట్ లేదా హాట్ డ్రింక్ మిక్స్ చేయాలనుకుంటారు.కొందరు సాస్ జామ్ లాంటివి పోసుకొని తినడానికి ఇష్టపడతారు.
అయితే అచ్చం స్వీట్ లాగానే ఇతర వస్తు లేవీ కలుపుకోకుండా నేరుగా తినడానికి ఇష్టపడే అదే టేస్టీ బ్రెడ్ దొరికితే ఉంటే ఎలా ఉంటుంది? సూపర్ కదూ.
జపాన్‌లోని సకిమోటో బేకరీ( Sakimoto Bakery in Japan ) సరిగ్గా ఇలాంటి బ్రెడ్ నే తయారు చేసింది.ఆ రొట్టె ముక్క ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిని క్రాన్‌బెర్రీ చాక్లెట్ వైట్ బ్రెడ్ అంటారు.ఇది కొద్ది కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఈ రొట్టెని ఎలా తయారు చేస్తారో వైరల్ వీడియోలో కనిపించింది.
టోక్యో, ఒసాకాలో ( Tokyo, Osaka ) ఈ వీడియోలోని రొట్టె ముక్కను ‘ది బెస్ట్ చాక్లెట్ బ్రెడ్’ అని పిలుస్తారు.దీనిని తయారు చేసేటప్పుడు పిండిలో చాక్లెట్, క్రాన్‌బెర్రీస్, చాక్లెట్ చిప్స్‌ను కలుపుతారు.

ఆపై పిండిని ముక్కలుగా చేసి గుండ్రని రొట్టెలుగా రోల్ చేస్తారు.ఈ పచ్చి బ్రెడ్స్‌ను కుక్ చేయడానికి పెద్ద ఓవెన్‌లో ఉంచుతారు.అవి పూర్తయిన తర్వాత, ప్రతి బ్రెడ్‌పే బేకరీ పేరును రాస్తారు.జపనీస్ ఫుడ్ పేజీ వీడియోను షేర్ చేసింది.ప్రజలు ఈ బ్రెడ్‌ను సకిమోటో బేకరీలో కొనుగోలు చేయవచ్చని వీడియో వెల్లడించింది.క్రాన్‌బెర్రీ చాక్లెట్ వైట్ బ్రెడ్( Cranberry Chocolate White Bread ) ధర 1050 యెన్లు (అంటే సుమారు రూ.580).ఇది చాక్లెట్ పిండిలో చాక్లెట్ చిప్స్, క్రాన్‌బెర్రీలు కలిగి ఉంటుంది.

ఈ బ్రెడ్ చాలా మెత్తగా, రుచిగా ఉంటుందని ట్రై చేసిన వారు చెబుతున్నారు.సకిమోటో బేకరీ చాలా శుభ్రంగా ఉంటుందని కూడా వారంటున్నారు.అమెరికన్ బేకరీల కంటే ఇది చాలా బాగుంటుందని పేర్కొంటున్నారు.చైనీస్ బ్రెడ్ కంటే జపనీస్ బ్రెడ్‌ను ఇష్టపడతారని మరో వ్యక్తి చెప్పాడు.చైనాలోని పదార్థాల నాణ్యత అసలు బాగోదని తెలిపారు.ఈ రొట్టె తినడానికి మాత్రమే కాదు, చూడటానికి కూడా బాగుంటుంది.
ఇది చక్కటి గుండ్రని ఆకారం, దాని మీద బేకరీ పేరుతో నోరూరిస్తుంది.వీటిని తింటే ఆకలి వేస్తుందని, మరిన్ని తినాలనిపిస్తుందని ఒకరు కామెంట్ చేశారు.







