సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే ప్రతిభ ఉంటే సరిపోదు, కాస్త అదృష్టం కూడా ఉండాలి.అదృష్టం లేకపోతే ఎంతటి మహామహులైన అపజయాలు ఎదుర్కోక తప్పదు.
సీనియర్ ఎన్టీఆర్ కి( Sr NTR ) కూడా ఒక్కోసారి టైమ్ కలిసి రాక ఆయన చేసిన సినిమాలు బిగ్గెస్ట్ ఫ్లాపులుగా నిలిచాయి.ఇక మాయాబజార్, పాతాళభైరవి, కృష్ణార్జున యుద్ధం, జగదేకవీరుని కథ వంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన కె.వి.రెడ్డికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన “ఉమా చండీ గౌరీ శంకరుల కథ”( Uma Chandi Gowri Sankarula Katha ) ఫ్లాప్ అయ్యింది.
ఎన్టీఆర్ కె.వి.రెడ్డి కాంబో అంటే అప్పట్లో ఎక్స్‌పెక్టషన్స్ వేరే రేంజ్ లో ఉండేవి.ఎందుకంటే వారు కలిసి చేసిన ప్రతి సినిమా ఒక మాస్టర్ పీస్ అయింది.ఉమా చండీ గౌరీ శంకరుల కథ అలాగే ఉంటుందేమో అని అందరూ భావించి థియేటర్లకు వెళ్లారు కానీ వారికి నిరాశ ఎదురయ్యింది.
అసలు ఈ సినిమా తీసింది కేవీ రెడ్డి( KV Reddy ) యేనా? అని ఇప్పటికీ సందేహం వ్యక్తం చేసేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.ఈ మూవీ 1968 లో రిలీజ్ అయింది.
దీనికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించాడు.

ఈ సినిమా ద్వారా భృగు మహర్షి భార్య పేరు పులమాదేవి అనేది తెలిసింది.అంతకుమించి ఈ మూవీ వల్ల ప్రేక్షకులకు కలిగిన పెద్ద ప్రయోజనమేమీ లేదని చెప్పుకోవచ్చు.నిజానికి ఈ సినిమా చాలామందికి అర్థం కాలేదు.
ఈ మూవీ డిజాస్టర్ కావడానికి అది కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇందులోని పాటలు కూడా పెద్దగా హిట్ కాలేదు.
అయితే ఎన్టీఆర్ ఈ మూవీలో చేసిన శివతాండవం( Sivathandavam ) అద్భుతంగా ఉంటుంది.

ఆయనలాగా ఎవరు చేయలేరేమో అన్నట్లు ఎన్టీఆర్ శివతాండవం అద్భుతంగా చేశాడు.ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ను సరోజా దేవి( Saroja Devi ) పోషించింది.ముక్కామల, రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, గిరిజ లాంటి పాపులర్ యాక్టర్స్ కూడా ఇందులో నటించారు.
ఒక దిగ్గజ హీరో దర్శకుడు సరిగా ప్లాన్ చేసుకోకపోతే సినిమా ఎలా డిజాస్టర్ అవుతుందో చెప్పడానికి “ఉమా చండీ గౌరీ శంకరుల కథ” ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.ఈ సినిమా కోసం పని చేసిన వారందరూ ప్రతిభవంతులే ఆయన ఇది ప్రేక్షకులను మెప్పించ లేకపోవడం బాధాకరం అని చెప్పుకోవచ్చు.







