Chandrababu Naidu : నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాం చంద్రబాబు సంచలన హామీ..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) శనివారం పర్చూరులో “రా కదలిరా” సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు.

 Chandrababu Naidu : నాణ్యమైన మద్యం సరఫరా -TeluguStop.com

ఈ సందర్భంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పై చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు.తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నారని పార్టీ కోసం నిలబడ్డారు అని పొగిడారు.

ఇదే సమయంలో జగన్( CM ys jagan ) ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.తాను ఇప్పటి ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించి ఉంటే వైసీపీ నాయకులు ఇళ్లల్లో నుండి బయటకు వచ్చేవాళ్ళు కాదు.

ఈ ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదు.వచ్చే ఎన్నికలలో ప్రజలు ఇంటికి పంపించేస్తారు.

అంటూ విమర్శించారు.

మాట్లాడితే జగన్ బటన్ నొక్కాను అని చెబుతున్నారు.అందుకే ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగాయని అన్నారు.చెత్త, నీరు, ఆస్తి పై పన్నులు పెంచారని విమర్శించారు.

అదేవిధంగా మధ్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ పై జగన్ ఎందుకు బటన్ నొక్కలేదని నిలదీశారు.వైసీపీ ( YCP )పెట్టే ప్రతి స్కీమ్ వెనక స్కామ్ ఉందని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని అన్నారు.ఇదే సమయంలో తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అంతేకాకుండా సౌర శక్తి ద్వారా ఇల్లు, పొలాల వద్ద కరెంటు ఉత్పత్తి చేసుకునేలా చేస్తాం.దీనివల్ల విద్యుత్ చార్జీలు తగ్గుతాయి.

పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం పార్టీని నమ్మండి అని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube