టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) “వెళ్ళిపోమాకే (2017)”తో నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు.తాజాగా ఆ విషయాన్ని విశ్వక్ సేన్‌యే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.‘ఈ నగరానికి ఏమైంది( Ee Nagaraniki Emaindi )’ సినిమాతో విశ్వక్ సేన్ స్టార్ హీరోగా ఎదిగాడు.తర్వాత “హిట్: ది కేసు” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకొని తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యాడు.ఇప్పుడు విద్యాధర్ దర్శకత్వంలో ‘గామి’ సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.అంటే దాదాపు 20 రోజుల సమయం మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ మూవీని ప్రమోట్ చేయడానికి పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన మొదటి సినిమా ‘వెళ్ళిపోమాకే‘ కాదని, తాను తొలత చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై కనిపించానని చెప్పి ఆశ్చర్యపరిచాడు.ఈ హీరో మాట్లాడుతూ తనకు చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలనే ఆశ బాగా ఉండేదని చెప్పుకొచ్చాడు.ఆ మక్కువతో అక్కినేని నాగచైతన్య నటించిన “జోష్” సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా నటించాలని విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చాడు, కానీ సెలెక్ట్ కాలేదట.ఆ సమయంలో అతడు స్కూల్ లో చదువుకుంటున్నాడట.
చదువుకుంటూనే సినిమాల్లో నటించాలని ఎంతో తపన పడేవాడు విశ్వక్.
ఇలా ప్రయత్నాలు చేస్తుండగా ఒక రోజు దాసరి నారాయణరావు నిర్మాతగా తీస్తున్న ఒక మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం చూస్తున్నట్లు విశ్వక్ సేన్ కి తెలిసింది.దాంతో అతడు ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయ్యాడు.ఆ సినిమా పేరు “బంగారు బాబు( Bangaru Babu ) అందులో జగపతి బాబు, మీరా జాస్మిన్ హీరో హీరోయిన్లుగా నటించారు.2009లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ విశ్వక్ సేన్‌ను మాత్రం వెండి తెరకు పరిచయం చేసింది.ఆ సినిమాలో విశ్వక్ సేన్ సన్నివేశాన్ని ఒక్క రోజులోనే షూట్ చేశారట.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ చిన్నతనంలో హీరోని చెడగొట్టే స్నేహితుల్లో ఒకడిగా కనిపిస్తాడు.ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి దిల్‌షుఖ్ నగర్ లో ఫ్యామిలీతో కలిసి నివసించే వాడట.
అయితే మూవీలో సెలెక్ట్ అయిన తర్వాత అతని ఇంటికి రామోజీ ఫిలిం సిటీ నుంచి బస్సు వచ్చి తనను తీసుకెళ్లిందని చెప్పాడు.అప్పుడే రామోజీ ఫిలిం సిటీకి మొదటిసారి వెళ్లానని సినిమా సెట్స్ ఎలా ఉంటాయో తొలిసారిగా చూసానని చెప్పుకొచ్చాడీ హీరో.
ఆ చిన్న స్థాయి నుంచి ఇప్పుడు సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించే దాకా ఎదిగాడు.