ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హానర్ సంస్థ నుంచి హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5( Honor Choice Earbuds X5 ) పేరుతో అద్భుతమైన ఫీచర్లు ఉండే ఇయర్ బడ్స్ లాంచ్ అయింది.హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5: ఈ ఇయర్ బడ్స్ 30dB వరకు నాయిస్ క్యాన్సలేషన్( Noise Cancellation ) ఫీచర్, హ్యాండ్స్-ఫ్రీ కాల్ ఆన్సర్ ఫీచర్, పర్యావరణ నాయిస్ క్యాన్సలేషన్( ENC ) తో డ్యూయల్ మైక్రోఫోన్ లాంటి ఫీచర్ లతో ఉంటుంది.
హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5 SBC,AAC బ్లూటూత్ కొడెక్ లకు సపోర్ట్ తో 10mm డ్రమ్ డ్రైవర్ లతో పాటు వస్తుంది.ఈ ఇయర్ బడ్స్ లో ప్రత్యేకంగా ANC యాంబియంట్ సౌండ్ ట్రాన్స్ మిషన్ మోడ్ ను అందించారు.
దీంతో మెరుగైన సౌండ్ క్వాలిటీ పొందవచ్చు.

ఈ హానర్ ఛాయిస్ ఇయర్ బడ్స్ ఎక్స్5 చార్జింగ్( Charging ) విషయానికి వస్తే.ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 9 గంటల నిరంతర ప్లే బ్యాక్, 18 గంటల కాలింగ్ సమయం పొందవచ్చు.చార్జింగ్ కేస్ తోపాటు 35 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
ఈ ఇయర్ బడ్స్ చార్జింగ్ కోసం USB టైప్-C పోర్టు ఉపయోగించవచ్చు.దుమ్ము, ధూళి, నీటి నుండి రక్షణ కోసం IP54 రేటింగ్ అందించారు.

ఈ ఇయర్ బడ్స్ ధర రూ.1999 గా ఉంది.ఇవీ హానర్ అధికారిక వెబ్ సైట్ తో పాటు అమెజాన్ లో( Amazon ) అందుబాటులో ఉన్నాయి.కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులకు సంబంధించిన కార్డులతో ఈ ఇయర్ బడ్స్ ను కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.







