మామూలుగా థియేటర్లలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా సినిమాలు వరుసగా విడుదల అవుతూనే ఉంటాయి.అయితే సినిమాలు విడుదల అయ్యే క్రమంలో ఒక్కని చిన్న సినిమాలు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే వెనక్కి తగ్గి నిదానంగా మళ్ళీ విడుదల చేస్తూ ఉంటారు.
కానీ కొందరు మాత్రం పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమాలను విడుదల చేసి మంచి విజయం సాధిస్తూ ఉంటారు.చాలా సందర్భాలలో పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించాయి.

మరి పెద్ద సినిమాలకు పోటీగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఆ చిన్న సినిమాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా( Shankar Dada MBBS movie ) విడుదల అయినప్పుడు ఆనంద్( Anand ) అనే చిన్న సినిమా కేవలం 5 సెంటర్లలో విడుదల అయింది.ఈ సినిమా విడుదల అయిన విషయం కూడా మొదట చాలామందికి తెలియదు.కానీ ఆ తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించడంతోపాటు రికార్డుల మోత మోగించింది.
గుంటూరు కారం , సైంధవ్, నా సామీ రంగ లాంటి పెద్ద పెద్ద సినిమాల మధ్య విడుదల అయిన హనుమాన్( Hanuman ) సినిమా వాటన్నింటీని వెనక్కి నెట్టేసి మరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు( Cameraman Gangatho Rambabu ) సినిమా విడుదలైన నాలుగు రోజులు తర్వాత దేనికైనా రెడీ అనే సినిమా( Denikina ready ) విడుదల అయింది.మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్గా నటించింది.ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.







