కులగణన( Caste Census )కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) కులగణనకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టారు.
దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.ప్రభుత్వం కులగణనకు నిర్ణయం తీసుకోగా.
దానిపై ప్రతిపక్ష బీఆర్ఎస్( BRS ) కనీస అవగాహన లేకుండా మాట్లాడుతోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ తన పదేళ్ల పాలన కాలంలో కులగణనపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.కులగణనపై అందరి సలహాలు తీసుకుంటామని వెల్లడించారు.కులగణన కోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని నిర్ణయించామని మరోసారి తెలిపారు.